అభిప్రాయాలు… ఆలోచనలు… అక్షరాలు…

చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత…

ఇది కొండా సురేఖ స్వయంకృతం. దానికి కూతురు ఆజ్యం పోసింది. వెరసి బహిష్కరణ. ఇప్పుడు వెంట ఒక్కరు కూడా లేరు.

చెర్మాల శ్రీనివాస్10 సెప్టెంబర్ 2026 · సవరణ: 28 సెప్టెంబర్ 2026 · 2 నిమిషాలు
Konda surekha with her husband and daughter

కొండా సురేఖ.. బీసీ మహిళ.. మంత్రివర్గం నుండి బర్తరఫ్ అయింది. కాదు.. చేసుకుంది. కారణం.. అలవాటైన నోటి దూల. వారసత్వంగా కూతురికి కూడా అంటగట్టింది.
ఇక భర్త కొండా మురళి. వరంగల్ జిల్లాకు ఫ్యాక్షన్​ను పరిచయం చేసిన నేత. నడిరోడ్డుపై నరికివేతలు, గడ్డివాములో కాల్చివేతలతో జిల్లాను వణికించిన గూండా నాయకుడు. హత్యా రాజకీయాలలో ఆరితేరినవాడు. ఎర్రబెల్లి దయాకర్రావుపై ఎన్నోసార్లు విఫల హత్యాయత్నాలు చేసినవాడు. మాజీ మంత్రి మాధవరెడ్డి హత్యలో హస్తమున్నవాడు. వరంగల్ తూర్పున, పరకాల నియోజకవర్గాల్లో భయోత్పాతాలు సృష్టించిన కాంగ్రెస్ నేత. అప్పటి వరంగల్ ఎస్పీ నళిన్ ప్రభాత్ చేతిలో హతం కావాల్సినప్పుడు సురేఖ.. వైఎస్ కాళ్లమీద పడితే బతికిబట్ట కట్టిన వాడు.
దేశంలో ఉన్న పార్టీలన్నీ తిరిగి తిరిగి.. తిరిగి కాంగ్రెస్ గూటికే చేరి మంత్రి కాగలిగిన నాయకురాలు సురేఖ. ఈ కుటుంబానికి అధికారం లేకపోతే ఎప్పుడో హతమయ్యేది. ఆ భయంతోనే అధికారం కోసం పాకులాడుతుంటారు.
గీసుకొండ నడిరోడ్డుపై కేసీఆర్​ను నానా బూతులు తిట్టి దుమ్మెత్తిపోసిన సురేఖ వీడియోలు ఇప్పటికీ సోషల్​మీడియాలో తిరుగుతున్నాయి. మానుకోట రాళ్లదాడిలో జగన్ తరపున తెలంగాణ ఉద్యమకారులపై తనో రాయి వేసిన మహానాయకురాలు.
సెటిల్మెంట్లు, దందాలు, హత్యలతో కోట్లు వెనకేసుకుని, తాను బీసీనంటే ఎలా? వందల కోట్లున్న నాయకులు తాము బీసీలమని, ఎస్సీలమని అంటే అంతకంటే విడ్డూరం ఏముంటుంది? కళ్లుచెదిరిపోయే ఆస్థులు, బంగళాలు, కార్లు, షికార్లు… వీళ్లా బీసీలు, ఎస్సీలు?
ఇక తమ రాజకీయ ప్రస్థానంలో మిగిలిన పార్టీ.. బీజేపీ. వరంగల్లో స్థాయి ఉన్న నాయకురాలిగా సురేఖను పరిగణిస్తే అది బీజేపీ ఖర్మ. పరకాలలో గానీ, వరంగల్ తూర్పులో గానీ, ఇంకెక్కడైనా ఈ కుటుంబం ఇక గెలవదు. శాశ్వతంగా రాజకీయ సమాధి పొందినట్లే. ఇంకా మీసాలు దువ్వుతున్న మురళి సకల రోగాల పుట్ట.

తొందరపడి ఒక సుస్మిత ముందే కూసింది..

ఇక కూతురు సుస్మిత ఎప్పుడూ ముందే కూసే కోయిల. అయ్య నోట్లోంచి ఊడిపడ్డట్టు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవరూ ఊరుకోరు. పరకాల తన అయ్య జాగీరా? లేక తనకేమైన రాసిచ్చారా? అసలు ఏ స్థాయిలో మాట్లాడింది.? కొండా మురళి కూతురిగానా? లేక అత్తింటి స్వతంత్ర మహిళగానా..?
కొండా మురళి కూతురిగానే అయితే, సురేఖ కూతురి మాటలకు బాధ్యత వహించాల్సిందే. స్వతంత్ర మహిళ అయితే కొండా ఇంటిపేరు లేకుండా అత్తింటిపేరుతో మాట్లాడాలి. కొండా సుస్మితా పటేల్ అని సగర్వంగా ప్రకటించుకుంది కాబట్టి, అన్న మాటలన్నింటికీ తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలి. వారి కూతురు కాకపోతే సుస్మిత స్థాయి ఏంటి? ఒక సాధారణ ధనిక మహిళ.
రేవంత్​రెడ్డిని తిట్టింది కాబట్టి బీఆర్ఎస్ సంబరపడిపోవాల్సిన అవసరం లేదు. వాళ అమ్మ కేసీఆర్​ను ఘోరంగా తిట్టిపోసింది. అటువంటి మహిళను ఇంటికెళితే చీరెసారె, పసుపుకుంకుమలతో ఆదరించారు కేసీఆర్. అది ఆయన సంస్కారం. దాన్ని పొందే అర్హత ఏమాత్రం లేని సురేఖ మళ్లీ ఏ ముఖం పెట్టుకుని బీఆర్ఎస్ వైపు చూస్తుంది?
కర్మ హిట్స్ బ్యాక్… ప్రతీ చర్యకు ప్రతిచర్య ఉంటుంది. తప్పదు. ఏదోనాడు అందరూ తమతమ కర్మలకు ఫలితాన్ని అనుభవించాల్సిందే. నేడు అనుభవిస్తున్నదే శాశ్వతం అనుకుంటే పొరపాటు. ఇలా అనుకున్నవారందరూ కాలగర్భంలో కలిసిపోయారు. చరిత్రలో మరోరకంగా మిగిలిపోయారు.

తర్వాత చదవండి'Election Commission of India' నేమ్‌ప్లేట్ ఉన్న పగిలిన టేబుల్, వెనక మూడు ఖాళీ కుర్చీలు, ఫైళ్లు, బ్యాలెట్ బాక్స్ (ప్రతీకాత్మక చిత్రం)అతిథి మాటసీఈసీ రగడ: వ్యవస్థ వైఫల్యమా? రాజకీయ రణరంగమా?

ఈ కథనంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. ఏదైనా తప్పు కనిపిస్తే contact@maromaata.comకు రాయండి — సరిచేస్తాను. సంపాదకీయ విధానం →

చెర్మాల శ్రీనివాస్

రచయిత

నా గురించి →

మరిన్ని కథనాలు

One response to “చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత…”

  1. […] రాశాను — చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత అని. కొండా సురేఖ వెంట ఒక్కరూ లేరని. […]

షేర్