అభిప్రాయాలు… ఆలోచనలు… అక్షరాలు…

నా గురించి…

వృత్తిరీత్యా పత్రికా సాంకేతిక విభాగంలో పనిచేస్తున్నాను. ప్రవృత్తిరీత్యా తెలుగు భాషాభిమానిని. భాషపై మమకారం, జర్నలిస్టు గురువుల ప్రోత్సాహం నన్ను రచనల వైపు నడిపించాయి. ఈనాడుతో మొదలైన నా వృత్తి ప్రస్థానం వార్త, ఆంధ్రజ్యోతి, సూర్య పత్రికల మీదుగా నమస్తే తెలంగాణలో కొనసాగుతోంది.

మరో మాట — కొందరు మరోమాట అని, ఇంకొందరు Maro Maata అని రాస్తారు; అన్నీ ఇదే వేదిక: maromaata.com.

పత్రికల్లో అప్పుడప్పుడు కథనాలు రాసినా, నా భావనలు, ఆలోచనలు పంచుకోవడానికి, సమాజంలో నన్ను కలచివేసిన విషయాలను ప్రస్తావించడానికి ఫేస్‌బుక్‌ వేదికైంది. అక్కడ రాసిన రచనలను ఒకచోట భద్రపరిచి, ఎప్పటికీ పాఠకులకు అందుబాటులో ఉంచాలనే ఆలోచనతో ఈ బ్లాగ్‌—‘మరో మాట’—మొదలుపెట్టాను.

ఇక్కడ నా తలపోతలు, ఆవేదనలు, ఆలోచనలు ఉంటాయి. ప్రశ్నలు, విమర్శలూ ఉంటాయి. ఎవరినీ కించపరచడం నా ఉద్దేశం కాదు. నాకు అనిపించినదాన్ని నిజాయితీగా, నిర్భయంగా వ్యక్తపరచడానికి కలాన్ని వాడతాను. నా మాటతోపాటు మరో మాటను వినడానికీ ఈ వేదికలో చోటుంది.

రచనపై ఆసక్తి, సమాజం పట్ల ఆవేదన, మార్పు కోసం సూచనలు ఉన్న మిత్రులను అతిథి రచయితలుగా ఆహ్వానిస్తున్నాను. తమ అభిప్రాయాలను స్పష్టంగా, దృఢంగా, నిర్భయంగా చెప్పాలనుకునే ఔత్సాహికులందరికీ స్వాగతం.

పాఠకులు తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియజేయవచ్చు. ఏకీభవించినా, విభేదించినా—పరస్పర గౌరవంతో మాట్లాడుకుందాం.

భావనలు… ఆలోచనలు… అక్షరాలు…

— చెర్మాల శ్రీనివాస్

నాకు రాయండి: contact@maromaata.com