అభిప్రాయాలు… ఆలోచనలు… అక్షరాలు…

అతడొక అష్టావక్రుడు. పుట్టుకతో కాదు, బుద్ధితో..

డబ్బు, అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారగల వీధిరౌడీ మాటలు విన్నాక తెలుగు భాష చచ్చిపోయిందన్న భావన. అసహనం, అహంకారం, అసందర్భ ప్రేలాపనలపై ఒక ఘాటైన మాట.

చెర్మాల శ్రీనివాస్4 ఫిబ్రవరి 2026 · సవరణ: 24 అక్టోబర్ 2026 · 2 నిమిషాలు
అతడొక అష్టావక్రుడు. పుట్టుకతో కాదు, బుద్ధితో..

డబ్బు, అధికారం.. ఈ రెంటి కోసం ఏ స్థాయికైనా దిగజారగల వీధిరౌడీలలో అగ్రగణ్యుడు. అంటే, మనమెవరమూ ‌‌ఇంత కిందికి జారిన జీవాలను ఇంతవరకు చూడలేదు. ఇక చూడం కూడా. ఇటువంటి ఒక నమూనా జాతిని చూసిన తర్వాత మానవజాతిలో ఎందుకు పుట్టామా అనిపించింది. ఇవాల్టి లేకి భాష వింటే తెలుగుకు కూడా ఇంత తెగులు పట్టుకుందా అని బాధేసింది.

ఈ వింతజీవి నేడు చేసుకున్న వాంతులు, విరేచనాలు విన్నవారందరికీ తెలుగు భాష చచ్చిపోయిందన్న భావన కలిగింది. ఇంక బతుకూ బతికి ఇలాంటి ధూర్తుడి నోట్లో చావాల్సివచ్చిందేనని ఘోష. చాలా మంది గమనించి ఉంటారు, వాడు మాట్లాడుతుంటే ఒకరకమైన జుగుప్స కలిగి ఒళ్లు జలదరిస్తుంటుంది. అదేంటో, సరైన పోలిక లేదు గానీ, మన ఆడాళ్లు చాలామంది సాధారణంగా బల్లిని చూసి ఉలిక్కిపడుతుంటారు. అది భయం కాదు. అసహ్యమా? జుగుప్సా? ఏదో ఇలాంటిదే. సరిగ్గా ఈ లక్షణాన్ని ఓ లక్షసార్లు హెచ్చవేస్తే వాడికి మ్యాచవుతుందనుకుంటా. వాడి నోరు ఒక డంప్​యార్డు. ఒక సెప్టిక్ ట్యాంకు.

ఎప్పుడు మాట్లాడుతున్నా… అసహనంగా కదిలే తీరు, అసహ్యమైన హావభావాలు, అసందర్భ ప్రేలాపనలు, అహంకార ప్రదర్శనలు. అసమర్థ చేతలతో ఏ ప్రాణితో పోల్చడానికి వీల్లేకుండా ఉంటాడు. మనకు గమనించే అవకాశం లేకపోయింది గానీ, వీడు పుట్టినప్పుడు అన్నిరకాల అపశకునాలు గోచరించేఉంటాయి. అంటే, ధుర్యోధనుడు పుట్టినప్పుడు కనిపించాయంటారే.. అలా కొన్నివేల రెట్లు ఎక్కువగా కనిపించిఉండొచ్చు. ఆ… ఏముందిలే, ఏదో సునామీనో, అగ్నిపర్వతమో, భూకంపమో అయుండొచ్చని అప్పటోళ్లు లైట్ తీసుకునిఉంటారు.

వీడా నా భర్తని, ఇంత హీనుడా నా తండ్రని ఇంట్లోవాళ్లు అనకపోయినా, మనసులోనైతే అనుకుని ఉంటారని నా అంచనా. పెద్దవాడు, గొప్పవాడు అనే విషయాలు పక్కనపెట్టినా, సాటి మనిషి గురించి ఇంత అసహ్యంగా మాట్లాడేవాన్ని మానవసమాజం ఇంతవరకు ఎరిగుండదు.

సాధారణంగా ప్రతి జీవి, చెట్టు, చేమా.. అన్నింటికీ ఒక తేజస్సు(ఆరా) ఉంటుంది. ఆ వస్తువు ఎంత గొప్పదైతే చుట్టూ ఆ తేజస్సు అంత విస్తరించి ఉంటుంది. గొప్ప మానవతావాది, సంస్కారి, సౌమ్యుడు అయితే తనచుట్టూ ఓ ఫర్లాంగు దూరం వరకు ఆ తేజస్సు ప్రజ్వరిల్లుతుంటుంది. ఇటువంటి ధూర్తుడైతే, ఆ ఆరా అసలుండదు. సమీపంలో ఉంటే ఒక రకమైన ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అసహనంగా ఉంటుంది.

పాలన చేతగాక, అభివృద్ధి అంటే ఏంటో తెలియక, నీచ, నికృష్ణ, హీన సంస్కారంతో, దురహంకారంతో మాట్లాడితే ఎవడూ ఏదీ గెలవలేడు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఏం? ఓడిపోతే ఏం జరుగుతుంది? చచ్చయితే పోవు కదా. ఆ మాత్రందానికి ఇంత దరిద్రపు దిగజారుడుతనం దేనికి?

తుమ్మితే ఊడిపోయే ముక్కులా మారిపోయిన కాంగ్రెస్ పార్టీ బతుకు రేపోమాపో అన్నట్లుంది. ఈ దేశానికి తొలినాటి నుండీ చేసిన ద్రోహానికి నేడు అఖరి గాలి పీలుస్తోంది. అందులో ఉన్న వీడికీ అదేగతి. ఇవాళ కాంగ్రెస్ భవిష్యత్తు మిర్యాలగూడలో స్పష్టంగా కనిపించింది.

ఇలాంటివాడికి ‘ఇల్లీగల్’గా వత్తాసు పలుకుతున్న పోలీసుబాసుకు తెలుగు సరిగ్గా రాకపోవడం ఆయన చేసుకున్న అదృష్టం.

కానీ, ఒక్క మాట. అధికారం చేతులు మారగానే వీడి రాత ఎలా మారుతుందో ఇప్పుడు ఎవ్వరూ కనీసం ఊహించనుకూడా లేరు. అలాంటి బతుకు బతకడం కంటే చావడమే మేలని మనుషులనుకునేలా ఉంటుంది. తప్పదు, శిక్ష అనుభవించాల్సిందే.

తర్వాత చదవండి'Election Commission of India' నేమ్‌ప్లేట్ ఉన్న పగిలిన టేబుల్, వెనక మూడు ఖాళీ కుర్చీలు, ఫైళ్లు, బ్యాలెట్ బాక్స్ (ప్రతీకాత్మక చిత్రం)అతిథి మాటసీఈసీ రగడ: వ్యవస్థ వైఫల్యమా? రాజకీయ రణరంగమా?

ఈ కథనంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. ఏదైనా తప్పు కనిపిస్తే contact@maromaata.comకు రాయండి — సరిచేస్తాను. సంపాదకీయ విధానం →

చెర్మాల శ్రీనివాస్

రచయిత

నా గురించి →

మరిన్ని కథనాలు

షేర్