తెలంగాణ కొత్త రాష్ట్రం కాదు. స్వయంగా ఒక దేశంగా భాసిల్లింది. సొంత జెండా, సొంత కరెన్సీ, సొంత సైన్యం, సొంత విమానాశ్రయం, సొంత రైల్వేలైన్లలతో విలసిల్లిన నేల. వద్దు మొర్రో.. అంటే వాడెవడో భాషాప్రయుక్త రాష్ట్రాలంటూ కలవని మనుషులను కలిపి ఓ సంసారం మొదలుపెట్టారు.
సిరుల నిండిన నేల కాబట్టి, దోపిడీకి అనుకూలంగా ఉందనుకుని ఆంధ్రానాయకులు హైదరాబాద్‌లో తిష్టవేసి అందినకాడికి దోచుకోవడం మొదలుపెట్టారు. అది వనరుల దగ్గర్నుంచి, ఉద్యోగాల దాకా విస్తరించి అసలు హక్కుదారులకు దిక్కులేకుండా చేసింది. అత్తెసరు ఉద్యమాలు అప్పుడప్పుడూ లేచినా, కాంగ్రెస్ నాయకుల్లో సహజంగా ఉండే స్వార్థంతో బలైపోయాయి.
అప్పుడొచ్చిన కేసీఆర్ పుణ్యమాని, ఉద్యమం ఉవ్వెత్తున లేచి, ప్రజలందరూ మర్లబడి కొట్లాడుకుని తప్పనిసరి పరిస్థితులు తీసుకొచ్చి తమ రాష్ట్రాన్ని మళ్లీ సాధించుకున్నారు. ఇందులో నొప్పి ఎవరికి కలిగింది? సీమాంధ్ర నాయకులకైతే ఉండటంలో తప్పులేదు. పుణ్యానికొచ్చే సొమ్ములు పోయాయని. మరి బీజేపీకి? ఒక ఓటు – రెండు రాష్ట్రాలని అన్నదెవరు? అధికారంలోకి రావడం కోసం అన్ని రకాల గడ్డి కరిచి అందలం ఎక్కిందెవరు?
నరేంద్ర మోదీకి ఎందుకనో మొదటినుంచీ తెలంగాణ అంటే పడదు. కారణం ఇదమిద్దంగా తెలియదు. తన ప్రమేయం లేకుండానే ఒక రాష్ట్రం ఏర్పడిందని దుగ్ధా? అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నోడికి తెలంగాణ ఏర్పాటుతో ఏం సంబంధం? మరి ఎన్నోసార్లు తల్లిని చంపి బిడ్డను బతికించారని ఏడ్చాడు. ఎందుకంత బాధ? తెలంగాణ తననేం చేసింది.?
ఎవడుపడితే వాడు ఏది పడితే అది మాట్లాడుతూ, తన అక్కసునంతా వెళ్లగక్కుతున్నారు. రాష్ట్రమేర్పడి పన్నెండేళ్లు గడిచినా, ఏడుపులు మాత్రం మానలేకపోతున్నారు. కొత్త రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధించడం మరీ కెలికినట్లయింది. తెలంగాణ అంటేనే ఇష్టం లేని వారు ఆ రాష్ట్ర పథకాలను మాత్రం నిస్సిగ్గుగా కాపీ కొట్టి, ఢంకా బజాయించుకున్నారు. సరే.. పరవాలేదు.. ఎక్కడివాళ్లైనా మనోళ్లే కదా.. మంచిని అనుభవిస్తే తప్పేంలేదు. కానీ ఆ కృతజ్ఞత లేని కృతఘ్నలయ్యారు.
మొన్నో మోదీ, నిన్నో కృష్ణదేవరాయలు, ఇవాళ ఒక తేజస్వి సూర్య… ఎవరు వీళ్లంతా? సరిపడని పొత్తుతో ఇమడలేక స్వేచ్ఛ కోరుకుని వచ్చిన తెలంగాణను పాకిస్థాన్‌తో పోల్చిన వెధవ ఎవడీ తేజస్వీ.? తెలంగాణ గురించేంతెలుసు వీడికి? ఎంత ధైర్యముంటే తెలంగాణ పిల్లల త్యాగాలను ఎగతాళి చేస్తాడు? ఎంత పొగరుంటే ఉవ్వెత్తున లేచిన ఉద్యమాన్ని అవహేళన చేస్తాడు?
అక్కడికేదో వీళ్ల తాత జాగీరైనట్లు ప్రతీవాడికి తెలంగాణ అంటే కంటగింపే. ఎనిమిది మంది అష్టావక్రులు ఎంపీలుగా గెలిచి ఏం పీకుతున్నారు? అందులో ఇద్దరు వెధవలు కేంద్ర మంత్రులు. ఒక్కడికి ఓ అంటే తా రాదు. కళ్లముందు రాష్ట్ర పుట్టుకను అవమానిస్తుంటే సిగ్గు, శరం, మానం, అభిమానం, రోషం, పౌరుషం లేని దద్దమ్మలుగా చూస్తుండిపోయారు. వీళ్లనా తెలంగాణ గెలిపించింది? ఎవడో రామచంద్రరావట.. బీజేపీ ప్రెసిడెంటు. ఫలానా తేజస్వి అలా అనలేదు, ఆయన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. తప్పుగా అర్థం చేసుకోవడమేంటి? వాడేమైనా కొరియా భాషలో మాట్లాడాడా? ఇలాంటి సంకరజాతి నాయకులు ఉన్న ఆ పార్టీని గెలిపించినందుకు తెలంగాణ ప్రజలు తమ చెప్పులతో తమనే కొట్టుకోవాలి.
దేశాన్నేదో ఉద్ధరిస్తున్నట్లు ఘనంగా చెప్పుకునే మోదీ, ఎటుపక్క చూసినా ఎవడో ఒకడు జాగాను నాకేస్తూనే ఉన్నా నోరు మెదపడు. పైగా విశ్వగురువనే బిరుదొకటి. మోదీలో ఒకడు కాడు, ఇద్దరు కాదు, ఓ పదిమంది అపరిచితులుంటారు. అవసరాన్ని బట్టి బయటకొస్తారు. ఊళ్లకు ఊళ్లు తగలేసే వాడొకడు, తన పార్టీలో తనను మించినవారుంటే వాళ్లను చంపేవాడొకడు, ట్రంప్ దోస్తు ఒకడు, పుతిన్ ఫ్రెండు మరొకడు, అన్నట్లు వాళ్లలో ఒకడు ఒవైసీకి కూడా దోస్తే… ఇంకా అందులో తెలంగాణ శత్రువొకడు.
తెలంగాణ తెరువుకు ఎవడొచ్చినా, చమ్డాలెక్కదీసి, లెక్కపెట్టాల్సిందే. ప్రతీవాడికి బాగా అలుసైపోయింది. ఒక్కసారి.. ఒకే ఒక్కసారి తెలంగాణ ప్రజలు చేసిన తప్పుకు ఇంటాబయటా ఐదేళ్ల కఠిన కారాగారశిక్ష అనుభవిస్తున్నారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ఇంటి పార్టీని మళ్లీ కూర్చోబెడితే ఈ చెత్త వెధవలందరికీ బుద్ధొచ్చేలా ఎదుగుదాం. మండిన కళ్లు, కడుపులను ఎగదోసి బూడిద చేద్దాం.
ఢిల్లీకి కాదు, మనం గల్లీకి వందనం చేద్దాం. అక్కన్నుంచే మళ్లీ పుడదాం, పెరుగుదాం… ఎవన్నైనా తలవంచి చూసే స్థాయికి ఎదుగుదాం.








