అభిప్రాయాలు… ఆలోచనలు… అక్షరాలు…

రాహుల్ మనుస్మృతి ప్రస్తావన — అర్థభారతీయుడి అర్థజ్ఞానం

ఛాత్రోంకీ ఘూంజ్ కార్యక్రమంలో సందర్భం లేకుండా మనుస్మృతి ప్రస్తావన తెచ్చిన రాహుల్ గాంధీ. కలికాలంలో మనుస్మృతి ఎక్కడిది? భారత రాజ్యాంగం ఏమైంది? భారతీయ స్త్రీల చరిత్ర తెలియనివాడి బట్టీ మాటలపై నా మాట — నా మిత్రుడి సమాధానంతో సహా.

చెర్మాల శ్రీనివాస్29 ఆగస్ట్ 2026 · సవరణ: 28 సెప్టెంబర్ 2026 · 2 నిమిషాలు
Rahul Gandhi at Chhatron ki goonj

ఛాత్రోంకీ ఘూంజ్ అనే దిక్కుమాలిన ప్రోగ్రాం ఒకటి పెట్టి, సమయసందర్భాలు లేకుండా. అసత్యాలు, అర్థసత్యాలు మాట్లాడిన రాహుల్ గాంధీ.. అసలు అక్కడ అవసరమే లేని మనుస్మృతి ప్రస్తావన తెచ్చాడు.
తను చెప్పిన రేపులు, ఇంజనీరింగ్ ఉద్యోగాలు లాంటి లెక్కలన్నీ బండబూతులు(ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారమే సుమా..)
అసలు కలికాలంలో మనుస్మృతి ఎక్కడిది? మరి భారత రాజ్యాంగం ఏమైంది? భారతీయ శిక్షా స్మృతులు, న్యాయ సంహితలు ఏమయ్యాయి? పోనీ… సారు సెలవిచ్చినట్లే ఉంటున్నారా..నేటి భారత మహిళలు? అసలు ఎక్కడా, ఎవరూ ఎవరి కింద ఉండటమే లేదు.. ఇక్కడి నారీమణుల శౌర్యప్రతాపాలు, దేవీ రూపాలు ఇంకెక్కడున్నాయి?

వీడో అర్థ భారతీయుడు, అర్థజ్ఞాని.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడాలో తెలియని మూర్ఖ శిఖామణి. ప్రతీసారీ ఇలా హౌలేగా మారడం ఇదేం సరదానో పాడో..?
నా మిత్రుడి సమాధానం ఒకసారి చూద్దాం..


ఆదిశంకరాచార్యులకు, మండిన మిశ్రులకు మధ్య జరిగిన మహా సంవాదానికి మధ్యవర్తిత్వం వహించి, విజేతను ప్రకటించింది మండిన మిశ్రుని భార్య ఉభయ భారతి.
దశరథుని భార్య కైకేయి అస్త్రవిద్యలు తెలిసిన, దశరథునితో పాటు యుద్ధానికి వెళ్లిన గొప్ప యోధురాలు. దేవాసుర యుద్ధంలో రథచక్రం విరిగిపోయినప్పుడు దాన్ని నియంత్రించినందుకే దశరథుడు కైకేయికి వరాలు ఇచ్చాడు.. ‘న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి’ అని దశరథుడు చెప్పలేదు, యుద్ధభూమిలో తనతో పాటు నిలబడి పోరాడమనే అడిగాడు..
శ్రీకృష్ణుని భార్య సత్యభామ, మహాభారతంలోని ఉలూపి, చిత్రాంగద గొప్ప యోధులు.. హిందువులు ఆరాధించే దుర్గ, కాళీమాత రాక్షసులను సంహరించిన ఉగ్ర మూర్తులు..
రామాయణంలో సీతమ్మ, మహాభారతంలో ద్రౌపది తర్కశాస్త్రంలో ప్రావీణ్యం ఉన్నవారిగానే చూపబడ్డారు. ఈ ఇద్దరు స్త్రీల ఆత్మగౌరవం ప్రశ్నించబడినప్పుడే హిందువుల, ఈ దేశపు గొప్ప ఇతిహాసాలు పుట్టాయి. ప్రపంచంలోనే స్త్రీలను తొమ్మిది రోజుల పాటు నవరాత్రుల రూపంలో పూజించే సంస్కృతి మరే ఇతర సంస్కృతిలోనూ లేదు.. తంత్ర శాస్త్రంలో స్త్రీల ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
మనుస్మృతి ఏ కాలంలోనూ భారతదేశపు సామాజిక చట్టంగా లేదు, ఏ ఒక్క రాజు దాని ఆధారంగా పాలించలేదు. ఒకవేళ అలా పాలించి ఉంటే, చంద్రగుప్త మౌర్యుని రాజ్యంలో మహిళలు ఎన్నటికీ అంగరక్షకులుగా నియమింపబడేవారు కాదు, గ్రీకు యాత్రికుడు మెగస్తనీస్ దానిని చూసి ఉండేవాడు కాదు.
భారతీయ స్త్రీలే కాదు, పురుషులు కూడా ఏనాడూ మనుస్మృతి కింద తీర్పు కోసం ఎదురుచూసే వర్గంగా బతకలేదు.
షా బానో కేసులో విడాకులు తీసుకున్న మహిళకు భరణం ఇవ్వాలన్న కోర్టు తీర్పును అధిగమించేందుకు ఆర్డినెన్స్ తెచ్చిన పాలకుడి కొడుకు, ట్రిపుల్ తలాక్ పార్లమెంట్‌కు వచ్చినప్పుడు దానిని వ్యతిరేకించి వాకౌట్ చేసిన పార్టీ నాయకుడు, మహిళా రిజర్వేషన్‌ను వ్యతిరేకించిన నాయకుడు, యూనిఫాం సివిల్ కోడ్‌ను వ్యతిరేకిస్తున్న రాహుల్ రాజీవ్ నోటి నుండి ఇలాంటి బట్టీ పట్టిన మాటలు వినాల్సి రావడం తెలివైన యువత చేసుకున్న కర్మ.
సోనియా మైనో కొడుక్కి ఈ దేశపు గొప్ప వారసత్వం గురించో, భారతీయ స్త్రీల గొప్పతనం గురించో తెలిసి ఉండకపోవచ్చు, అతనికి దానిపై ఆసక్తి కూడా ఉండి ఉండకపోవచ్చు.. కానీ దేశ యువత, ముఖ్యంగా మహిళలు దీని గురించి అవగాహన కలిగి ఉండాలి.. మీ పూర్వీకులు తమ తండ్రి, సోదరుడు లేదా భర్త కింద స్వేచ్ఛ లేకుండా బతికిన వారు కాదు.
ఎవరో చెవిలో ఊదితే బట్టీ పట్టి రాహుల్ రాజీవ్ చెబుతున్న మనుస్మృతిలోని ఇండియా కాదు నా ఇండియా.
దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు పోరాడిన జిజియాబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి, అహల్యాబాయి హోల్కర్ లాంటి వీరనారిమణుల ఇండియా, ఔవ్వయార్, మీరాబాయి, జనాబాయి గీతాలను భక్తితో పాడుకునే వారి ఇండియా, గార్గి, సులభ లాంటి జ్ఞాన ప్రతీకల ఇండియా, ద్రౌపది, సీతమ్మ కోసం సైన్యాలు బారులు తీరిన ఇండియా నాది…
రాహుల్ రాజీవ్ ఎన్ని యుగాలు పుట్టినా అర్థం చేసుకోలేని ఈ దేశాన్ని తల్లిగా, దశప్రహరణిగా, దుర్గగా పూజించే వారి ఇండియా నాది.

Courtesy: Ravinder Reddy Guda

తర్వాత చదవండి'Election Commission of India' నేమ్‌ప్లేట్ ఉన్న పగిలిన టేబుల్, వెనక మూడు ఖాళీ కుర్చీలు, ఫైళ్లు, బ్యాలెట్ బాక్స్ (ప్రతీకాత్మక చిత్రం)అతిథి మాటసీఈసీ రగడ: వ్యవస్థ వైఫల్యమా? రాజకీయ రణరంగమా?

ఈ కథనంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. ఏదైనా తప్పు కనిపిస్తే contact@maromaata.comకు రాయండి — సరిచేస్తాను. సంపాదకీయ విధానం →

చెర్మాల శ్రీనివాస్

రచయిత

నా గురించి →

మరిన్ని కథనాలు

షేర్