ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? అనేది సామెత. ఇది రాధాకృష్ణ, రేవంత్‌లకు చక్కగా సరిపోతుంది.
ఇంత ధైర్యంగా ఎలా రాస్తున్నాడు? అసలు 14ఏళ్లుగా తెలంగాణలో ఆంధ్రాజ్యోతి ఎలా మనగలుగుతోంది? ఎవరు దీనికి కారణం.? సమాధానం మనందరికీ తెలుసు.
మనమే..
రోజుకి దాదాపు లక్ష కాపీలు ఈ తెలంగాణలో రాధాకృష్ణ అమ్ముకోగలుగుతున్నాడు. కేవలం తెలంగాణ వాసులపై ఉన్న నిర్లక్ష్యధోరణి వల్ల. “ఏం పర్లేదు.. మనకేం ఢోకా లేదు, ఇక్కడెవడికీ అంత పట్టింపుల్లేవు” అనే మొండిధైర్యం. అంటే మనమంటే ఉన్న ఓ చిన్నచూపు.. విషాక్షరాల కూర్పులో నేర్పరిగా వాటిని మన మీదకే సంధిస్తూ మన పైసలతో ఆనందంగా బతుకుతున్నాడు.
ఎవడైనా సరే.. ఎంత ధైర్యముంటే కేసీఆర్ చావు కోరుతాడు? ఆ మాటలు అని ఇంకా ఎలా ఉంటున్నారిక్కడ? కేవలం ‘మనమున్నామ’నే నమ్మకం. మనమీద తనకో ‘భరోసా’. ఇంకో వేయిసార్లు రాసినా, మనమేం ‘పీకలేమ’నే అనుభవం.
పగోడిదైనా చావు కోరుకోకూడదని ఆర్యోక్తి. అటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రదాతనే అంతంత మాటలనే ఈ తుచ్ఛులకు అంతటి సభ్యతాసంస్కారాలు జన్మతఃనే లేవు.
రాధాకృష్ణకు ఇదివాళ కొత్తేం కాదు. గత పద్నాలుగేళ్లుగా ఇవే చంఢాలపు రాతలు. కేసీఆర్ అంటే ఉన్న కక్ష. ఆ కక్ష చంద్రబాబు దగ్గర్నుండి వచ్చింది. అదే కక్ష ఇప్పుడు రేవంత్లోనూ ఉంది. మీడియానడ్డుపెట్టుకుని తానేదో సుద్దపూసైనట్లు సుభాషితాలు వల్లిస్తుంటాడు. ఏకంగా భరతజాతినే ఉద్ధరిస్తున్నట్లు మోదీలకు, గాంధీలకు సలహాలిస్తుంటాడు. తనో పెద్ద గీతకారుడిలా చెత్త పలుకుల ‘చిత్త’ కృష్ణ ఉపదేశాలొకటి(ఈ ‘చిత్త’ అంటే ఏంటో మీకు పరిచయమున్న తన ఆంతరింగికులనడిగితే విశదీకరిస్తారు. తెలియకపోతే ఈ అసౌకర్యానికి మన్నించండి).
సమైక్యాంధ్రప్రదేశ్‌లో జరిగిన ప్రతీ పాపకార్యంలో ఈయనకు భాగస్వామ్యం ఉంది. అంతెందుకు? దివంగత ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసి, ఆయన దుర్మరణానికి కారణమైన హంతకబృందంలో కీలక సభ్యుడు కూడా. ఏ ఎండకాగొడుగు పట్టి బతక నేర్చిన ఆ ప్రత్యేక లక్షణాన్ని రేవంత్ కూడా వంటబట్టించుకున్నాడు. సరే.. ఆ విషయాలు మనకెందుకనుకున్నా, మన విషయమైతే మనకు ముఖ్యం కదా.
స్లో పాయిజన్ లాంటి ఈనాడు, కాలకూటం లాంటి ఆంధ్రాజ్యోతి ఏనాడు తెలంగాణ మంచి కోరలేదు. ఉద్యమకాలం నుండి నేటి వరకు… చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం నుండి హైదరాబాద్ మా కష్టార్జితం అనేదాకా… చంద్రబాబుకు రామోజీరావు రాజగురువైతే, రేవంత్‌కు రాధాకృష్ణ రాజగురువు. ఇవన్నీ తెలిసినా, తెలంగాణవాదాన్ని వారి మీడియాకు తాకట్టు పెట్టడానికి వెంపర్లాడే మన కుక్కమూతి పిందెలు. వాళ్లు ముఖాముఖికి పిలిస్తే, అక్కడికేదో ఆస్కార్ అవార్డు ప్రదానానికి ముఖ్య అతిథిగా పిలిచినట్లు మనవాళ్లు వెలుతుంటారు. అన్నట్లు ముందుగా అనుకున్న సామెత మనకు కూడా వర్తిస్తుంది. నాయకులలా ఉంటే, చందాదారులు ఇంకెలా ఉంటారు? తెలంగాణ పార్టీల నాయకులే ఆంధ్రాజ్యోతికి మహారాజ పోషకులు. కాబట్టి ఆ విష సర్పానికి మనమే పాలు పోసి పెంచుకుంటున్నాం. మరి కాటేసినప్పుడే రాని కోపం బుస కొడితే ఎందుకొస్తోంది?
నిజానికి ఆంధ్రాజ్యోతిని, రాధాకృష్ణను తెలంగాణ నుంచి తరిమికొట్టడం నిమిషం పని. తలుచుకుంటే 14ఏళ్ల కిందటే జరిగుండేది. కానీ, కొంతమంది కక్కుర్తి తెలంగాణ నాయకుల వల్ల ఇప్పటికీ సాధ్యం కావడం లేదు. ఇప్పటికీ పిలవగానే ఎగేసుకుంటూ వెళ్లి ఇంటర్వ్యూలిచ్చే సంకరజాతి లీడరల్ల వల్లే ఈ దుస్థితి. ఆ ఇంటర్వ్యూలో ఇజ్జత్ తీసినా మనకు సిగ్గు లేకపాయె.. ఆంధ్రాజ్యోతి అక్షరాలా లక్ష పేపర్లు అమ్ముడుపోవడంలో వీరిదే సహకారం. దాని గుణం తెలిసినా, మన గుణం మారకపోవడమే రాధాకృష్ణ ధైర్యం. ఒక్క కాపీ కూడా ఎవరూ కొనకపోతే, ఏం చేసుకుంటాడు? రేపు ‘గంధపు చెక్కల’ బదులు వీటినే వాడుకుంటాడు.
ఇప్పటికైనా మనకు సిగ్గూ, శరం,మానం, అభిమానం, లజ్జ ఉంటే తక్షణమే ఆ పేపర్‌ను, టీవీని తరిమేయాలి. ఆ టీవీకి చర్చలకెళ్లే నాయకులను బహిష్కరించాలి. లేకపోతే చావేం ఖర్మ? దినాలు కూడా చేస్తాడు.








